'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సంపత్ నంది నిర్మాతగా మారిపోయాడు.  సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
Image result for sampat nandi
హైదరాబాద్ .. ముంబై .. లోనావాలా .. పూణె .. కేరళ .. గోవా ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగిందనీ, మంచి అవుట్ ఫుట్ వచ్చిందని నిర్మాతలు అన్నారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.


సాంకేతిక నిపుణులు: కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : సంపత్ నంది.డైరెక్షన్: వి. జయశంకర్ నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ. సంగీతం: భీమ్స్ ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్. ఆర్ట్: రాజీవ్ స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల


మరింత సమాచారం తెలుసుకోండి: