త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా మారిన ‘అజ్ఞాతవాసి’ జ్ఞాపకాల నుండి బయటకు వద్దామని ఎంతో పట్టుదలతో ప్రస్తుతం జూనియర్ తో ‘అరవింద సమేత’ తీస్తూ ఉన్నా అనుకోకుండా ‘అజ్ఞాతవాసి’ ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం జూనియర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న ‘అరవింద సమేత’ కథలోని కొన్ని మలుపులు అని అంటున్నారు. 
Aravinda Sametha Veera Raghava First Look Motion Teaser - Sakshi
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాలో జూనియర్ పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుందని టాక్.  ఈమూవీ ఫస్ట్ హాఫ్ లో సిద్దార్థ్ గౌతమ్  అనే సాఫ్ట్ ఇంజనీర్ పాత్రలో జూనియర్ కూల్ గా కనిపిస్తే సెకండ్ హాఫ్ లో వీర రాఘవగా మరో కోణం చూపిస్తాడట. ఈ వీర రాఘవ పాత్ర చిత్తూరు ప్రాంతానికి చెందిన యాసలో ఉంటూ ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని తెలుస్తోంది. 

అయితే ఈమూవీ కథలో వీర రాఘవ ఉనికిని దాచుకోవడం కోసం జూనియర్ గౌతమ్ గా మారతాడా లేదంటే గౌతమ్ వీర రాఘవగా మారాల్సిన పరిస్థితి వస్తుందా అన్న విషయం మాత్రం తన సహాయ దర్శకులకు కూడ చెప్పకుండా చాల టాప్ సీక్రెట్ కొనసాగిస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈ కథకు సంబంధించిన ఈ లీకులు ఇలా బయటకు రావడంతో ‘అజ్ఞాతవాసి’ లో పవన్ కు కలిసిరాని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగం మళ్ళీ జూనియర్ పై త్రివిక్రమ్ ఎందుకు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.  

అయితే జూనియర్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసి చాలాకాలం అయిన నేపధ్యంలో ఇలాంటి ‘అజ్ఞాతవాసి’ ప్రయోగాలు ‘అరవింద సమేత’ లో కనిపించినా అభిమానులు పట్టించుకోరు అనే అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ నటన ఒకప్పటి జూనియర్ ‘సింహాద్రి’ మూవీ స్థాయిలో చాల పవర్ ఫుల్ గా ఉంటుంది అని అంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటివరకు ఏహీరో పైనా ప్రయోగించని పవర్ ఫుల్ డైలాగ్స్ ఈసినిమా ప్రత్యేకత అని వార్తలు వస్తున్నాయి. ఏమైనా ‘అజ్ఞాతవాసి’ ఛాయాల నుండి ఇంకా త్రివిక్రమ్ పూర్తిగా బయటకు రాలేకపోతున్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: