తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో విశాల్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఈ మద్య విశాల్, సమంత, అర్జున్ ముఖ్యపాత్రలుగా ‘అభిమన్యుడు’చిత్రం రిలీజ్ అయ్యింది.   కంటెంట్ నచ్చితే చాలు.. హీరో, భాషలతో సంబంధం లేకుండా మన తెలుగు ఆడియెన్స్ ఖచ్చితంగా ఆ చిత్రాన్ని నెత్తికెక్కించుకుంటారు.  ఒకప్పుడు విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
Image result for abhimanyudu
తాజాగా విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ మూవీ విషయంలో అదే రిజల్ట్ నమోదైంది. ప్రస్తుతం జనాలందర్ని పట్టిపీడిస్తున్న సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందడం.. జనాలకి అర్థమయ్యేలా చాలా పర్ఫెక్ట్‌గా దర్శకుడు దీన్ని చిత్రీకరించడంతో.. ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చకోవడంతో కలెక్షన్లతో దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 18 రోజుల్లో రూ.8 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కొల్లగొట్టింది.  ప్రింట్స్, పబ్లిసిటీతో కలుపుకుని ఈ మూవీ తెలుగు హక్కులకు రూ.4.50 కోట్లు ఖర్చవ్వగా.. దానికి రెట్టింపు వసూళ్ళతో భారీ లాభాలు తెచ్చిపెట్టి ఘనవిజయం సాధించింది. 

ఏరియావైజ్ గా కలెక్షన్లు : (కోట్లలో)
నైజాం : 2.95
ఉత్తరాంధ్ర :1.37
సీడెడ్ :0.94
ఈస్ట్ :0.42
వెస్ట్ :0.67
గుంటూరు :0.62
కృష్ణా :0.70
నెల్లూరు :0.33
టోటల్ ఏపి+తెలంగాణ : రూ.8 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: