తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ రేస్ లో ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుదీర్ బాబు.  ‘ఎస్ ఎంఎస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో ‘ప్రేమ కథా చిత్రమ్’మంచి విజయం సాధించింది.  ఆ తర్వాత కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో నటుడిగా మంచి మార్కులు సాధించినా..సినిమా డిజాస్టర్ అయ్యింది. 
Image result for sammohanam
ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఆరేడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు.  కానీ ఏ ఒక్క చిత్రం కూడా మనోడికి పెద్దగా పేరు తీసుకు రాలేదు..ఆ మద్య బాలీవుడ్ లో నెగిటీవ్ పాత్రలో కూడా నటించాడు...అక్కడా పెద్ద పేరు రాలేదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా..ఇంద్రగంటి మోహనకృష్ణ దర్వకత్వంలో సుధీర్ నటించిన ‘సమ్మోహనం’ అన్ని రకాలుగా మంచి ఫలితం అందించింది. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని చక్కటి ఓపెనింగ్స్ సంపాదించింది.
Image result for sammohanam
ఇప్పటికే దాదాపుగా బయ్యర్లందరూ సేఫ్ అయిపోయారు. అయితే ఈ చిత్రం పై మొదట పెద్ద అంచనాలు ఏమీ రాకపోవడంతో..తక్కువ మొత్తానికి హక్కులు తీసుకున్న బయ్యర్ ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశాడు. ఎలాంటి స్టార్ అట్రాక్షన్ లేని ఈ చిత్రం ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం విశేషం.
Image result for sammohanam
సోమవారం నాటికి 4.3 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ‘సమ్మోహనం’ మంగళవారం ఆఫర్ల సపోర్టుతో మంచి వసూళ్లు రాబట్టింది. హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. రెండో వీకెండ్లో కూడా ‘సమ్మోహనం’ జోరు కొనసాగితే.. 8 లక్షల డాలర్ల మార్కును టచ్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: