టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది..ఆయన సినిమాల్లో సెంటిమెంట్, కామెడీ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది.  ఇప్పటి వరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి.  ఈ మద్య పవన్ కళ్యాన్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. 
Image result for ntr aravinda sametha veera raghava
ప్రస్తుతం మాటల మాంత్రికుడు నందమూరి కుర్రోడితో సినిమా తీస్తున్నారు.  టెంపర్ సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ఎన్టీఆర్ ఏలాంటి పాత్రలో కనిపిస్తాడో...ఒక్క పాత్రలోనే ద్విపాత్రలో కనిపిస్తున్నాడా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.
Image result for ntr aravinda sametha veera raghava
ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన 'వీరరాఘవ'గా కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.  ఈ పాత్ర పూర్తి స్థాయిలో రఫ్ అండ్ టఫ్ గా కనిపించబోతుందట. ఇక ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ 'సిద్ధార్థ్ గౌతమ్' పేరుతో టెక్కీగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్రలో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా .. కూల్ గా .. స్మార్ట్ గా కనిపిస్తాడని చెబుతున్నారు.
Image result for ntr aravinda sametha veera raghava
రెండు పాత్రల మధ్య గల వేరియేషన్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: