‘స్పైడర్’ ఘోర పరాజయం తరువాత మన టాప్ హీరోలు ఎవరు రకుల్ పై పెద్దగా ఆసక్తికనపరచకపోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ కోలీవుడ్ లలో తన అవకాశాలు వెతుక్కుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దీనికితోడు ఈమధ్య ఈమె ఫ్యాషన్ మ్యాగజైన్స్ కు ఇస్తున్న ఫోటో షూట్ మరింత హాట్ గా ఉండటంతో ఈమె అవకాశాల కోసం ఎంత తాపత్రయ పడుతోందో అర్ధం అవుతుంది.
Rakul Preet Singh shoots for her next Dhruva
ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న హిందీ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ పై ప్రశంసలు కురిపిస్తోంది రకుల్. రాధికా ఆప్టే నేహా ధూపియా కైరా అద్వానీ లాంటి క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రసారం అవుతున్న సెక్స్ కథలు రకుల్ కు బాగా నచ్చడంతో ఇలాంటి సిరీస్ మన దక్షిణాది భాషలలో కూడ వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తోంది రకుల్. 
Rakul Preet Singh
మనిషి కోరికల గురించి చెప్పడం కోసం హద్దులను చెరిపేస్తున్న వైనం ఈ సిరీస్ లో హైలైట్ అని అంటూ రకుల్ ఇప్పటి వరకు ఈ సిరీస్ లో నటించిన యాక్టర్స్ ను అదేవిధంగా మేకర్స్ ను కూడ పొగుడుతోంది. దీనినిబట్టి చూస్తుంటే మన దక్షిణాది భాషలలో ఎవరైనా ధైర్యం చేసి ఇలాంటి బూతు కథల వెబ్ సిరీస్ ను నిర్మిస్తే తాను రెడీ అన్న సంకేతాలు రకుల్ కామెంట్స్ ను బట్టి అర్ధం అవుతోంది. 
Rakul Preet Singh Photos Download
లేటెస్ట్ గా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో అర్బన్ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్న రకుల్ ఈసినిమా తరువాత తనకు బాలీవుడ్ లో చాల అవకాశాలు వస్తాయని ఆశపడుతోంది. ప్రస్తుతం ఈమె తమిళంలో సూర్య మరియు కార్తీల ప్రాజెక్టులతో పాటు శివకార్తికేయన్ తో కూడా ఒక మూవీలో నటిస్తోంది. అయితే మన తెలుగులో మాత్రం ఈమెపట్ల ఏటాప్ హీరో దృష్టిపెట్టని నేపధ్యంలో రకుల్ తెలుగులో అవకాశాల కోసం రకరకాల రాయబారాలు చేస్తోంది అని టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: