నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 మొదటి ఎలిమినేషన్ సంజన అయ్యారు.  అప్పటి నుంచి బిగ్ బాస్ పై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది.  మొదట వారం రోజులు టీమ్ సభ్యుల విషయంలో మాత్రం బిగ్ బాస్ మాత్రమే కాదు జనాలకు కూడా పెద్దగా ఆసక్తి కలగలేదు.  బిగ్ బాస్ సీజన్ 2లో 10 ఎపిసోడ్‌లు పూర్తయ్యే సరికి సభ్యుల మద్య వివాదాలు, బుజ్జగింపులు, స్నేహాలు మొదలయ్యాయి. 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్‌ ఇంటి నియమాలను పాటించకపోవడం పట్ల ఫైర్ అయ్యారు బిగ్‌బాస్. ఇంటిలో ఉన్న సభ్యులందరూ నియమాలు పాటించేలా చూడాల్సిన కెప్టెన్ నియమాలను ఉల్లంఘించడం నేరం అన్నారు బిగ్ బాస్.  అంతే కాదు బిగ్ బాస్ లో ఉదయం పూట నిద్రపోవడం క్షమించరానిదంటూ ఇంటి నియమాలను గుర్తు చేశారు. మైక్ లను సరిగా ధరించడం లేదు.

కావాలని కొంత మంది మైక్ లను దాచేస్తున్నారు. ఇంగ్లీషు, ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. ఇంటి సభ్యులు పదే పదే నామినేషన్ ప్రక్రియ గురించి చర్చిస్తున్నారు.  ఇలాంటి విషయాల్లో బిగ్ బాస్ చాలా కఠినంగా ఉంటుందని..మరి టీమ్ సభ్యుల విషయంలో మరింత కేర్ తీసుకోవాలని కెప్టెన్ సామ్రాట్ కి బిగ్ బాస్ తెలిపారు. 

ఇంటి నియమాలను పాటించడం లేదు. వాళ్లు పాటించేలా చూడకపోతే పర్యవసానాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. టాస్క్ ఉందని అనౌన్స్ మెంట్ వచ్చినా కోసం ఇంకా రెడీ కాలేదు. కెప్టెన్‌గా మీరు విఫలం అయ్యారంటూ సామ్రాట్‌ని హెచ్చరించారు బిగ్ బాస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: