‘బిగ్ బాస్ 2’ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూనే నాని రాజకీయాలకు సంబంధించిన ఆలోచనలు కూడ చేస్తున్నాడు. రాబోతున్న సంవత్సరం ఎన్నికల సంవత్సరం కావడంతో ఒక పొలిటికల్ టచ్ ఉండే సినిమాకు నాని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా పెద్దపెద్ద నాయకులు సెలెబ్రెటీలు ఒక సభలో తమ ఉపన్యాసం మొదలు పెట్టేడప్పుడు ‘సభకు నమస్కారం’ అనడం ఒక సాంప్రదాయం. 
 ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా..
ఇప్పుడు అదే మాటను నాని తన భవిష్యత్ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ నాని దిల్ రాజుల కాంబినేషన్ లో వచ్చే సంవత్సరం ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్ చేసి నిర్మించబోతున్నట్లు టాక్. ఈ ఏడాది మహేష్ ‘భరత్ అనే నేను’ మూవీ పొలిటికల్ టచ్ తో ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపధ్యంలో అలాంటి ఒక పొలిటికల్ జోనర్ మూవీని నాని చేయాలని నిశ్చయించుకావడంతో ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. 
 ‘సభకు నమస్కారం' టైటిల్
దీనికితోడు విజయ్ దేవర కొండ హీరోగా ఓటు ప్రాధాన్యత చెపుతూ రాజకీయ చైతన్యం కలిగించే ‘నోట’  మూవీ త్వరలో విడుదల కాబోతున్న పరిస్థుతులలో ఇలాంటి కథాంశాలు ఉన్న సినిమాలకు ప్రేక్షకులలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇలా రాజకీయ సినిమా నిర్ణయం తీసుకున్నాడు అని టాక్. ప్రస్తుతం నాని హీరో నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. 
షూటింగులతో నాని బిజీ బిజీ
ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే స్పోర్ట్స్ నేపధ్యంలో ‘మళ్లీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఒక క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. దీనికోసం నాని ఒక ప్రముఖ క్రికెట్ కోచ్ దగ్గర త్వరలో శిక్షణ కూడ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బుల్లితెర ‘బిగ్ బాస్ 2’ నిర్వహిస్తూ మరొక వైపు చాల వెరైటీ కథలతో కూడిన సినిమాలను ఎంపిక చేస్తున్న నాని వ్యూహాలు టాప్ యంగ్ హీరోలకు కలవరపాటును కలిగిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: