ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల జోరు బాగా పెరిగిపోయింది.  సినీ, క్రీడా, రాజకీయ నేపథ్యాల్లో గొప్పగా రాణించిన వారి జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమాలు తీస్తున్నారు.  ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ క్రికెటర్ ఎం.ఎస్.దోనీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీశారు.  స్టార్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’త్వరలో రిలీజ్ కాబోతుంది.  ఇక తెలుగు లో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా తీశారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనకు సినీ ఇండస్ట్రీనే కాదు..రాజకీయ నాయకులు సైతం ఫిదా అయ్యారు.
Image result for mahanati
ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది.  అంతే కాదు దివంగల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సెట్స్ పైకి వచ్చింది.  అయితే ఈ సినిమాలన్నీ అశేష ప్రేక్షకుల ఆదరణను పొందుతూ అనూహ్యమైన విజయాన్ని సాధిస్తున్నాయి. ఇక భారత దేశంలో  అత్యంత శక్తిమంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారు.
Image result for sanju movie
ఆమె పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు .. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వం.  అంత గొప్ప మహిళా నేత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కితే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  తాజాగా  తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలని ఉందని మనీషా కొయిరాలా అన్నారు. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 
Image result for indira gandhi
ఆ మద్య క్యాన్సర్ తో బాధపడిన మనిషా ఎంతో మనోధైర్యంతో చికిత్స చేయించుకొని ఆ మహామ్మారి నుంచి బయట పడ్డారు.  అయితే 16 యేళ్ల క్రితమే తాను ప్రధాన పాత్రగా ఇందిరాగాంధీ బయోపిక్ కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయనీ, ఎన్. చంద్ర దర్శకుడిగా కొంత వర్క్ జరిగిన సంగతిని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ పాత్రలో మెప్పించాలనే మనీషా ఆశలు నెరవేరతాయేమో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: