ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఒకే రోజు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకే సందర్భంలో రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా తెలుగులో సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంటారు.  ఆ సమయంలో చిన్న హీరో సినిమాలు పోటీకి అస్సలు రావు..ఇక చిన్న చిన్న పండగల సందర్భంగా చిన్న హీరోల సినిమాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. 
Image result for శంబో శంకర
ఇక పెద్ద హీరోల సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ అయితే..థియేటర్ల ప్రాబ్లమ్ కూడా బాగానే ఉంటుంది..అందుకే ఒకరోజు తప్పించి ఒకరోజు రిలీజ్ చేస్తుంటారు.  ఈ నెల 29 న తెలుగులో మరో వండర్ జరగబోతుంది..ఆ రోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. కాకపోతే..ఏడు సినిమాలు కూడా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నాయి అయితే ఒకేరోజున 7 సినిమాలు విడుదల అంటే థియేటర్ ల సమస్య వస్తుంది దాంతో కొన్ని సినిమాల విడుదల ఆగిపోవచ్చు. 

ఇక ఆ ఏడు సినిమాల విషయానికి వస్తే..జబర్ధస్త్ కామెడీ షోలో పాపులర్ అయిన షకలక శంకర్ నటించిన ‘శంబో శంకర’, నందూ హీరోగా నటించిన ‘కన్నుల్లో నీ రూపమే’, రవి వీడే ‘సంజీవని’, నా లవ్ స్టోరీ, రవి చావల దర్శకత్వంలో ‘సూపర్ స్కెచ్’ లతో పాటు మళియాళ సూపర్ స్టార్, మెగా అబ్బాయి అల్లు శిరీష్ నటించిన ‘యుద్ద భూమి’ సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి.
Image result for నగరానికి ఏమైంది
ఈ ఏడు సినిమాలలో చెప్పుకోతగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రం మాత్రమే ! దాస్యం తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రం తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ నగరానికి ఏమైంది పై అంచనాలు ఉన్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: