ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పొలం బాట పట్టారు. సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన పాలను అందించేందుకు భారీగా ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగారు. ‘హ్యాపీ ఆవులు’ బ్రాండ్ పేరుతో ఆయన పాల వ్యాపారం ప్రారంభించారు. లీటర్ పాల ధర రూ. 150. అంత ఖరీదు ఎందుకంటే.. ఈ పాలను రసాయనాలు, ఇతర కృత్రిమ పద్ధతుల్లో కాకుండా ప్రకృతి సహజంగా ఉత్పత్తి చేస్తారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Image result for milk business
దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈ క్రమంలో, హైదరాబాద్ నగర శివార్లలో తనకు ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.ఉత్పత్తి ఖర్చు ఎక్కువ కనుకు లీటరు రూ. 150కి అమ్ముతాం.. ఏదో డబ్బు సంపాదించాలని నేను ఈ వ్యాపారంలోకి రావడం లేదు.
Image result for దేసీ పాల వ్యాపారం
ప్రజలకు రసాయన రహితమైన పాలను, కూరగాయలను అందించడానికి అడుగుపెడుతున్నాను. రామానాయుడు ఫిలిం స్టూడియోను కూడా పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా మారుస్తాం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నాం..పర్యావరణ పరిరక్షణకు అందరూ తమ వంతు కృషి చేయాలి.. అని కోరారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: