ఈ మద్య స్టార్ హీరోల తనయులు వారసులుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత మాస్ ఇమేజ్ సంపాదించాడు విజయ్.   ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న విజయ్ త్వరలో తన కుమారుడు సంజ‌య్ మూవీల్లోకి తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.   
Related image
ఇటీవలే చెన్నైలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న సంజయ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కెనడా వెళ్లనున్నాడట. సీనియర్ హీరోల కుమారులు ఇండస్ట్రీలోకి  వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఈ పద్దతి కొంచెం ఎక్కువే. ప్రస్తుతమున్న మన యువ స్టార్ హీరోల్లో చాలా మంది ఒకప్పటి హీరోల పిల్లలే.
Image result for hero vijay son sanjay
ఇదిలా ఉంటే..తెలుగులో  సంచలన విజయాన్ని సాధించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ హక్కులను పొందినవారు, ఈ రీమేక్ ను స్టార్ హీరో విక్రమ్ తనయుడితో చేయడానికి సిద్ధమవుతున్నారు. విక్రమ్ తన తనయుడు 'ధృవ్'ను హీరోగా పరిచయం చేద్దామని అనుకున్నాడు. అయితే 'అర్జున్ రెడ్డి' కథ ఆయనకి బాగా నచ్చడంతో, ఈ కథతో ధృవ్ ను తెరకి పరిచయం చేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేశాడు.

'వర్మ' టైటిల్ తో బాలా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం, ధృవ్ గెడ్డం పెంచేసి డిఫరెంట్ లుక్ తో కనిపించాడు.  మొత్తానికి స్టార్ హీరోల తనయులు త్వరలో హీరోలుగా ఎంట్రీ ఇవ్వడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: