తెలుగు ఆడియెన్స్ కు ఏమాత్రం అలవాటు లేని బిగ్ బాస్ రియాలిటీ షోని ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరోతో మొదలుపెట్టింది స్టార్ మా. బుల్లితెర మీద జూనియర్ సందడి అందరిని ఆశ్చర్యపరచింది. అంతేకాదు ఎన్.టి.ఆర్ హోస్టింగ్ టాలెంట్ బిగ్ బాస్ సీజన్ 1 ను సూపర్ సక్సెస్ చేసింది.


తారక్ చేసిన బిగ్ బాస్ షోకి మంచి టి.ఆర్.పి రేటింగ్స్ వచ్చాయి. స్టార్ మా టాప్ రేంజ్ లో నిలబెట్టే రేటింగులు తెచ్చిపెట్టింది బిగ్ బాస్. స్టార్ మా బిగ్ బాస్ తో 16.18 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చింది. రియాలిటీ షోకి ఈ రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ రావడం సర్ ప్రైజ్ అనిపించింది. 


అయితే సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షో మొదలై వారం కావొస్తుంది. కేవలం నాని యాంకరింగ్ 3 రోజులే చూశాం. ఈ 3 రోజుల్లో నాని అదరగొట్టాడని చెప్పొచ్చు. టి.ఆర్.పి రేటింగులో కూడా 15 పాయింట్స్ సాధించింది బిగ్ బాస్. ఈ లెక్కన చూస్తే తారక్ కు దగ్గరగా నాని వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. 


ఇక కంటెస్టంట్స్ గా సెలబ్రిటీస్ కొందరే అయినా మిగతా ఇంటి సభ్యులు షోని రసవత్తరంగా సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి వారం సంజనా ఎలిమినేట్ అవగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఎన్.టి.ఆర్ రేంజ్ కు తక్కువే అయినా నాని చేస్తున్న షో కూడా చెప్పుకోదగిన టి.ఆర్.పి రేటుని సాధించడం మంచి విషయమే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: