అభిమానులచేత డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకునే ప్రభాస్ చాల సరదాగా మాట్లాడుతాడు అన్న పేరుంది. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిటైర్ మెంట్ ఆలోచనలు బయటపెట్టి చాలామందికి షాక్ ఇచ్చాడు. 
Prabhas, Bahubali
‘సాహో’ తరువాత ఏ సినిమాలలో నటించబోతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈమూవీ పూర్తి అయ్యాక తాను ఏదైనా వ్యాపారం లేదా ఇష్టమైన వ్యవసాయం చేస్తానేమో అని అంటూ జోక్ చేసాడు. దీనితో ‘సాహో’ షూటింగ్ విషయంలో జరుగుతున్న విపరీతమైన ఆలస్యానికి విసుకుచెంది ప్రభాస్ ఇలా సెటైరికల్ గా కామెంట్ చేసాడా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
prabhas-opens-up-marriage-mysterious-life-baahubali
ఇదే సందర్భంలో తన ‘సాహో’ విశేషాల గురించి చెబుతూ ఈమూవీ శ్రద్దా  కపూర్ పాత్రతో ప్రారంభం అవుతుందని సినిమా ముందుకు వెళ్ళేకొద్ది ఆమె పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది అన్న విషయాలను లీక్ చేసాడు. అంతేకాదు ఈమూవీలో తనతో పాటు నటించే 11 పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని లీకులు ఇస్తున్నాడు.
Cute Beauty Shraddha Kapoor Latest Images
ఇదే సందర్భంలో శ్రద్ధా కపూర్ హిందీ అమ్మాయి అయినా చాల సులువుగా తెలుగు నేర్చుకుని డైలాగులు చెపుతోందని అయితే తాను ఈమూవీకి సంబంధించి హిందీ వర్షన్ షూటింగ్ సమయంలో డైలాగులు చెప్పడానికి తాను నానాపాట్లు పడుతున్నానని తన పై తానే జోక్ చేసుకున్నాడు ప్రభాస్. ఇదే ఇంటర్వ్యూలో ఎన్ని సార్లు ప్రశ్నించినా ప్రభాస్ తాను ‘సాహో’ తరువాత ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయాన్ని బయటపెట్టకపోవడంతో ఈమూవీ ప్రాజెక్ట్ పై ఇంకా ప్రభాస్ కు క్లారిటీ రాలేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: