జూనియర్ త్రివిక్రమ్ ల కాబినేషణ్ లో రూపొందింపబడుతున్న ‘అరవింద సమేత’ రిజల్ట్ గురించి జూనియర్ అభిమానుల కంటే పవన్ అభిమానులు విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’ విషయంలో త్రివిక్రమ్ మితిమీరిన నమ్మకంతో పాటు దర్శకత్వం విషయంలో పూర్తిగా పట్టు తప్పడంతో త్రివిక్రమ్ పవన్ అభిమానులకు ప్రస్తుతం శత్రువుగా మారిపోయాడు.
Aravinda Sametha Veera Raghava First Look Motion Teaser - Sakshi
అయితే త్రివిక్రమ్ తన మెదడుకు పూర్తిగా పదును పెట్టి ‘అరవింద సమేత’ కోసం మంచి డైలాగులు రాస్తూ ఆమూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా చేయడానికి విపరీతమైన శ్రమ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇలాంటి శ్రద్ధ త్రివిక్రమ్ పవన్ పట్ల ఎందుకు తీసుకోలేదు అన్న అసహనంలో పవన్ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ‘అరవింద సమేత’ సినిమా ప్రారంభానికి పవన్ అతిధిగా రావడమే కాకుండా ఆమూవీ మొదటి షాట్ కు క్లాప్ కొట్టాడు పవన్. తమ అభిమాన హీరో మంచి మనసుతో ఏమి చేసినా అది సక్సస్ అవుతుంది అన్న నమ్మకం పవన్ అభిమానులలో చాల ఎక్కువ. ఈ నేపధ్యంలో ‘అరవింద సమేత’ హిట్ అయితే అది పవన్ గోల్డెన్ హ్యాండ్ ప్రభావం వల్లనే అన్న అభిప్రాయంలో పవన్ అభిమానులు ప్రస్తుతం ఉండటమే కాకుండా ఈమూవీ రిజల్ట్ పాజిటివ్ గా వస్తే పవన్ గోల్డెన్ హ్యాండ్ మహిమ గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయం ప్రచారంలో ఉంది. 

ఒకవేళ అనుకోకుండా ‘అరవింద సమేత’ కు నెగిటివ్ రిజల్ట్ వస్తే దాని ఫలితాన్ని త్రివిక్రమ్ ఖాతాలోకి వేసే ప్రయత్నంలో పవన్ అభిమానుల ఆలోచనలు ఉన్నట్లు టాక్. ఇది అంతా చూస్తుంటే ‘అరవింద సమేత’ హిట్ అయితే అది పవన్ ఖాతాలోకి ఫెయిల్ అయితే ఆఫలితాన్ని త్రివిక్రమ్ ఖాతాలోకి వేయాలి అని ఆలోచనలు చేస్తున్న పవన్ అభిమానులు రెండు వైపులా పదునున్న కత్తిలా మారారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: