తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం ‘రైతు బంధు’. ఈ పథకంలో పేదరైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తెచ్చుకోకుండా సొంతంగా పెట్టుబడి పెట్టి సేద్యం చేసే విధంగా ప్రభుత్వం నేరుగా డబ్బు చెల్లిస్తుంది.  అయితే వ్యవసాయం పేదలు మాత్రమే కాదు కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారు కూడా ఉన్నారు.  అందులో చాలా మంది తమకు వచ్చిన ‘రైతుబంధు’పెట్టుబడి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పుతున్నారు..తద్వారా రైతులకు మరిన్ని సేవలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది. 
Related image
ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ ‘రైతు బంధు’ ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చారు.  తాజాగా తెలంగాణ ప్రభుత్వం తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి అందించాలని కోరారు. జడ్చర్ల సమీపంలోని హేమాజీపూర్‌లో రాజీవ్ కనకాల కుటుంబానికి వ్యవసాయ భూమి ఉంది.
Image result for rythu bandhu cheque celebs
ఇందుకు గాను రైతు బంధు పథకం కింద రాజీవ్ కుటుంబ సభ్యులకు  రూ.29 వేల రూపాయల చెక్కును అధికారులు అందించారు. కాగా, చెక్కును తీసుకున్న రాజీవ్ కనకాల దంపతులు గురువారం గ్రామానికి వెళ్లి ఎమ్మార్వో రాంబాయిని కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు అందిన చెక్కును ఎమ్మార్వోకు అందించారు. దానిని రైతుల సంక్షేమం కోసమే ఉపయోగించాలని కోరారు. అంతే కాదు తమ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు..గతంలో తాము విరాళంగా ఇచ్చిన ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్‌ల పనితీరును పరిశీలించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: