తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు వింటేనే కొంత మంది అభిమానులు పూనకం వచ్చిన వాళ్లలా ఊగిపోతుంటారు.  ఇక తలైవా చిత్రం రిలీజ్ అవుతుందంటే..వారం ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది.  బాహుభాష నటుడు అయిన రజినీకాంత్ చిత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా ఓ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుంది. 

ఈ మద్య పా రంజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘కాలా’మిశ్రమ స్పందన వచ్చా..కలెక్షన్లు బాగానే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు .ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది . ఈ షూటింగ్ నిమిత్తం రజినీ క్యురీసెంగ్ అనే పాత్రం లోని అల్లిటా అనే రిసార్ట్ లో రూమ్ నెంబర్ 3లో పది రోజులుగా ఉంటున్నారు. తమ అభిమాన నటుడు రిసార్ట్ ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు ఆయన్ని కలుసుకోవడాని క్యూ కడుతున్నారు.   
Image result for rajinikanth darjeeling
తలైవా కు వున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఆ రిసార్ట్ ఓనర్లు ఆ విల్లా కు రజినీకాంత్ విల్లాగా పేరు పెట్టారు. ఇక రజినీ ఇంకొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం అక్కడే ఉండనున్నారు.  ఈ చిత్రం ఫై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు . సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు .



మరింత సమాచారం తెలుసుకోండి: