ఒక యంగ్ హీరో ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నప్పుడు అతడు బాగా అందంగా ఉన్న ఫోటోలు కాని లేదంటే అతడికి బలమైన ఫిజిక్ ను బహిరంగపరిచే సిక్స్ ప్యాక్ ఫోటోలను కాని మీడియాకు లీక్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ఒక హీరో ఏడుస్తున్న పోస్టర్ ను అతడు నటిస్తున్న సినిమాకు ప్రచార పోస్టర్ గా వాడిన సందర్భం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
kalyan Dev movie title vijetha
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తొలిచిత్రం ‘విజేత’ మూవీ జూలై మొదటివారంలో విడుదలకాబోతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే ‘విజేత’ తొలి సింగిల్ పోస్టర్ ను మీడియాకు విడుదల చేసినా కోడికి సంతాపం అంటూ ఈమూవీలోని ‘కొక్కరొక్కొ’ అనే పాటను మెగా అభిమానులకు పరిచయం చేస్తూ కళ్యాణ్ దేవ్ ఏడుస్తూ ఉన్నట్లు ఉన్న ఒక పోస్టర్ ను విడుదల చేసారు. 
Kalyan Dev Debut Movie Title Was Announced as Vijetha - Sakshi
అయితే మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోను కాస్త అందంగా చూపించాలి కానీ ఇలా ఏడుస్తూ ఉన్న పోస్టర్ ను ఎందుకు విడుదల చేసారు అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి పోస్టర్ ను డిజైన్ చేసిన విషయం చిరంజీవికి తెలియకుండా జరిగిందా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. 

చాల సంవత్సరాల క్రితం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ‘వంకాయ’ మీద రచయిత సిరివెన్నెలతో ఒక మంచి పాట రాయించాడు. అప్పట్లో ఆపాట సూపర్ హిట్. ఇప్పుడు అదే ప్రయోగాన్ని మనసులో ఉంచుకుని చాలామంది ఇష్టపడే చికెన్ ను హైలెట్ చేస్తూ కోడికి సంతాపం తెలుపుతూ ఈరోజు విడుదల అవుతున్న పాట కళ్యాణ్ దేవ్ కు ఎలాంటి బ్రేక్ ను ఇస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: