సూపర్ స్టార్ మహేష్ తో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ బడా బ్యానర్ లలో ఒకటైన గీతా ఆర్ట్స్ మెగా హీరోల సినిమాలనే చేస్తూ వచ్చింది. అడపదడపా మిగతా హీరోల సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ తో ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట అల్లు అరవింద్.


సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మహేష్ స్టామినా అంటే కచ్చితంగా రికార్డుల గురించి ప్రస్థావించాల్సిందే. ఫ్లాప్ అయిన సినిమాలు ఎలా ఉన్నా మహేష్ సినిమా హిట్ అయితే మాత్రం బీభత్సమైన కలక్షన్స్ రాబడుతున్నాయి. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలా తను కొట్టిన ప్రతి హిట్టు ఓ రికార్డే.


అందుకే అరవింద కన్ను మహేష్ మీద పడ్డది. ఓ భారీ సినిమానే మహేష్ తో అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఈమధ్య మెసేజ్ తో కూడిన సినిమాల వల్ల ప్రేక్షకుల్లో ప్రొడక్షన్ ఇమేజ్ ను పెంచుతున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమా వల్ల మైత్రి మేకర్స్ బ్యానర్ కు మంచి పేరు వచ్చింది. ఇక మరోపక్క డివివి దానయ్య భరత్ అనే నేనుతో ఇదవరకు హిట్టు కొట్టినా మనసుకి ఆనందాన్ని కలిగించే హిట్ ఇది అని అన్నాడు. 


గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ సినిమా ఎలా ఉండబోతుందో.. ఎవరి డైరక్షన్ లో సినిమా ఉంటుందో చూడాలి. కచ్చితంగా మెగా నిర్మాతతో సూపర్ స్టార్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: