బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో డేటింగ్ లో ఉంది.. ఈ ఇద్ద‌రూ కలసి అమెరికాలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.. తాగాజా వారిద్దరూ కలసి సీక్రెట్ గా ముంబై చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ప్రియాంక చోప్రా తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Image result for priyanka chopra lover nick jonas
వీరిద్దరూ కలసి అమెరికాలో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు మీడియాలో దర్శనం ఇచ్చాయి.ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఎవరి కంటా పడకుండా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. .. చివరకు కారులో వెళతుండగా కెమెరా కంటికి చిక్కారు.

ఎయిర్ పోర్ట్ నుంచి నిక్ తో కలసి జుహులోని తన ఇంటికి చేరుకుంది ప్రియాంక‌. పెళ్లి విష‌యం మాట్లాడేందుకో నిక్ వ‌చ్చిన‌ట్లు తాజా టాక్. ప్రియాంక తల్లిని కలిసేందుకే ముంబైకి నిక్ వచ్చినట్టు సమాచారం. అంతేకాదు, ప్రియాంక కుటుంబం ఇచ్చే పార్టీకి కూడా హాజరుకానున్నాడు. మరోవైపు, అమెరికాలో నిక్ కుటుంబసభ్యులను కొన్ని రోజుల క్రితం ప్రియాంక కలిసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: