తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తక కామెడీతో అభిమానులను కడుపుబ్బా నవ్వించారు.  అందులో కొంత మంది హీరోలుగా మారిన విషయం తెలిసిందే.  అలీ, సునీల్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ఈ కోవకు చెందినవారే. అలీ హీరోగా కొన్ని సినిమాలు చేసినా మళ్లీ కమెడియన్‌గా మారిపోయారు. సునీల్‌కు కూడా హీరో అవతారం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఇక శ్రీనివాసరెడ్డి, సప్తగిరి  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  అయితే ఇప్పుడు ఈ కోవలోకి మరో కమెడియన్ షకలక శంకర్ వచ్చి చేరారు.

ఆయన హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘శంభో శంకర’. ‘జబర్దస్త్’లో శంకర్‌తో పాటు కలసి పనిచేసిన శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.ఆర్.పిక్చర్స్, ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మొదటి నుంచి కూడా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున 'జబర్దస్త్' చేసేవాడిని.
Image result for షకలక శంకర్ jabardasth
కొంతకాలం 'జబర్దస్త్' చేసిన తరువాత నాకు కొత్త కాన్సెప్ట్ లు దొరకలేదు. అలాగని చెప్పేసి నేను ఏదిపడితే అది చేసేరకం కాదు .. డబ్బులొస్తున్నాయిగదా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.  జబర్ధస్త్ తో నాకంటూ మంచి ఇమేజ్ వచ్చింది..అలాంటపుడు బూతు కంటెంట్ తో స్కిట్స్ చేస్తే పరువు పోతుంది. అదే సమయంలో అనుకోకుండా ఇండస్ట్రీలో చిన్న చిన్న ఛాన్స్ రావడంతో నాగబాబుగారికి .. రోజా గారికి .. దర్శక నిర్మాతలకి చెప్పేసి బయటికి వచ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.     


మరింత సమాచారం తెలుసుకోండి: