సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు కేవలం డబ్బు సంపాదించడానికే కాకుండా సమాజ సేవకు కూడ కొంత సమయం..డబ్బు కేటాయిస్తున్నారు.  కొన్ని ఊర్లు దత్తత తీసుకోవడం..నిరుపేదలకు అండగా ఉండటం..అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఆదుకోవడం ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.  తాజాగా ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది.  గత సంవత్సరం అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 
Image result for samantha pratyusha foundation
సమంత పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో నటించదని భావించారు..కానీ ఈ అమ్మడు వివాహం తర్వాత రిలీజ్ అయిన ‘రంగస్థలం’, ‘అభిమన్యుడు’సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  సమంత నటిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా తనేంటో ఇప్పటికే నిరూపించుకుంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరిలాగే సంపాదన మీదే దృష్టి పెట్టింది.
Related image
కానీ తల్లి కోరిక మేరకు 2012లో నలుగురికి సాయపడాలనే ఉద్దేశంతో ప్రత్యూష ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది.  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇందులో అందరూ పాలు పంచుకోవాలని సందేశం ఇస్తోంది. స‌మంత తాజాగా చిన్నారులకు పౌష్టికాహారం ఇస్తూ ఫొటో తీసుకుని త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.
Image result for samantha pratyusha foundation
ఈ ఏడాది తమ కుటుంబం వంద మంది పాఠశాల బాలలకు ఏడాది పాటు మధ్యాహ్న భోజ‌నం అందిస్తుందని తెలిపింది. ఏడాదికి కేవ‌లం 950 రూపాయ‌లు విరాళంగా ఇస్తే ఏడాది పాటు ఒక విద్యార్థికి రుచిక‌ర‌మైన, పౌష్టికాహార భోజ‌నం అందించవచ్చని, అక్ష‌య పాత్ర ఆర్గనైజేషన్‌ ద్వారా సాయం చేయండని కోరింది. https://www.akshayapatra.org/isharemylunch వెబ్‌సైట్‌ ద్వారా సాయం చేయవచ్చని సమంత సూచించింది. ఆమె ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: