చిరంజీవి బాలకృష్ణల మధ్య చెప్పుకోతగ్గ సాన్నిహిత్యం లేకపోవడంతో వీరిద్దరూ జనం ముందు ఒకే వేదిక పై కనిపించడానికి ఇష్టపడరు. అయితే అలాంటి ఈ ఇద్దరినీ కలపడానికి మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చాల తీవ్రప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘విజేత’ మూవీ ఆడియో ఫంక్షన్ రేపు జరగబోతోంది. 
Balakrishna (left) recently said that his one time rival Chiranjeevi (right) is now his ‘close friend’
ఈ ఫంక్షన్ కు అతిధిగా రావడానికి ఇప్పటికే చిరంజీవి అంగీకరించిన నేపధ్యంలో చిరంజీవితో పాటు ఈ ఫంక్షన్ కు బాలకృష్ణ కూడ అతిధిగా వస్తే కళ్యాణ్ దేవ్ ‘విజేత’ కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని ఈమూవీ నిర్మాత సాయి కొర్రపాటి ఆలోచన అని తెలుస్తోంది. నందమూరి సింహం బాలయ్యతో సాయి కొర్రపాటికి మంచి సాన్నిహిత్యం ఉండటమే కాకుండా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ నటించబోయే మొదటి సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. 
kalyandev movie first look release date locked!
దీనితో నిర్మాత సాయి కొర్రపాటి ఏదోవిధంగా రేపు జరగబోయే ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలయ్యను కూడ అతిధిగా తీసుకు రావాలని చాల గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. ఈ నిర్మాతకు రాజమౌళితో కూడ చాల సన్నిహిత సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఈ ఫంక్షన్ విషయంలో రాజమౌళి ద్వారా బాలయ్య పై కూడ చాల ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 
Nandamuri Balakrishna becomes a proud grandfather
పొగడ్తలకు ముఖ్యంగా మొహమాటానికి చాల సులువుగా బుట్టలో పడిపోతాడు అన్న పేరున్న బాలకృష్ణ సాయి కొర్రపాటి ఒత్తిడికి తల ఒగ్గి మెగా అల్లుడుని ప్రమోట్ చేయడానికి నిజంగా వస్తే అది కళ్యాణ్ దేవ్ కు ఊహించని అదృష్టంగా మారుతుంది. ఇప్పటికే మెగా అభిమానులను లైన్ లో పెడుతున్న కళ్యాణ్ దేవ్ ఈ ప్రయత్నంలో కూడ సక్సస్ అయితే నందమూరి అభిమానుల మన్ననలను కూడ పొంది తన ‘విజేత’ కు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే ఆస్కారం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: