టాలీవుడ్ లో ఇండస్ట్రీ కొరత అందరికి తెలిసిందే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ అవలేరు కాని అందం అభినయం చూపించిన భామలకు ఇక్కడ భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం మళయాల భామల హవా కొనసాగిస్తున్న ఈ తరుణంలో క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు.


లేటెస్ట్ గా తెలుగు అమ్మాయే అయినా ముంబైలో సెటిల్ అయ్యి అక్కడ మోడలింగ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఓ భామ తెలుగులో ఇప్పుడు స్టార్ అవకాశాలను అందుకుంటుంది. ఆమె ఎవరో కాదు అదితి రావు హైదరి. మణిరత్నం చెలియా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు డైరెక్ట్ గా తెలుగు సినిమా సమ్మోహనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఆ సినిమాలో అదితిరావు బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమాలో ఆమెని చూసి స్టార్స్ ఆమెకు అవకాశాలిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ 25వ సినిమాలో అదితి రావు ఓ లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. తెలుగులో రెండో సినిమానే మహేష్ పక్కన అంటే ఇక అదితి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న మహేష్ 25వ సినిమాలో పూజా హెగ్దె ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. అదితి రావు కూడా మరో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. చూస్తుంటే తెలుగులో అదితి టాప్ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: