బిగ్ బాస్ సీజన్ 1 తారక్ హోస్టింగ్ టాలెంట్ తో సూపర్ ఎంటర్టైనర్ అయ్యింది. ఇక జూన్ 10 నుండి బిగ్ బాస్ సీజన్-2 మొదలైంది. నాని హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో 16 మంది కంటెస్టంట్స్ హౌజ్ లో ఉన్నారు. సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ మెన్ కు ఈసారి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.


నాని హోస్టింగ్ టాలెంట్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. తారక్ హోస్ట్ గా ఉన్నప్పుడు స్టార్ మా టి.ఆర్.పిలో టాప్ రేంజ్ కు వెళ్లింది. మళ్లీ నాని బిగ్ బాస్-2కి అదే రేంజ్ టి.ఆర్.పి సాధించింది. ఇక ఈ సీజన్ లో మానవతావాది బాబు గోగినేని కూడా హౌజ్ లో కంటెస్టంట్ గా వచ్చారు. 


హౌజ్ లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు.. అంతేకాదు కొన్నిసార్లు వారు కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. అయితే బాబు గోగినేని మాత్రం ఎవరి మీద కోపం ప్రదర్శించడం లేదు. లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ రారా బయటకు అని తన కోపాన్ని ప్రదర్శించాడు.


బాబు గోగినేనిని చూస్తే లాస్ట్ సీజన్ లో శివ బాలాజి గుర్తుకొస్తున్నాడు. శివ బాలాజి కూడా బిగ్ బాస్ 1లో బిగ్ బాస్ ను ఇడియట్, రాస్కల్ అని తిట్టాడు. బాత్ రూం లో నీళ్లు మట్టి మట్టిగా రావడంతో శివ బాలాజి బిగ్ బాస్ ను అరిచాడు. అతనే ఫైనల్ విన్నర్ అయ్యాడు. ఇక ఇప్పుడు బాబు కూడా అలానే చేశారు. ఆయనే ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తారని అంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: