కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన కొడుకు అకిరా నందన్ ను ఎవరు జూనియర్ పవర్ స్టార్ అంటూ పిలవవద్దని అలాంటి కామెంట్స్ తన దృష్టికి వస్తే ఆకామెంట్స్ ను తాను బ్లాక్ చేస్తాను అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పై అనేక రకాల చర్చలు జరగడమే కాకుండా పవన్ వీరాభిమానులు రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కూడ చేసారు. 
చాలా సంతోషంగా ఫీలయ్యాను
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అకిరా నందన్ పవన్ తో కలిసి ఒక హోటల్ లాంజ్ లో నడిచి వస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నిన్న తన ‘జనసేన’ కార్యాలయ గృహ ప్రవేశానికి విజయవాడ వచ్చినప్పుడు పవన్ తో పాటు అతడి భార్య అన్న మరియు అకిరా నందన్ లు కూడ వచ్చారు. 
 స్ట్రాంగ్ పేరెంట్స్, గ్రేట్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
ఈ సందర్భంగా పవన్ బస చేసిన ఒక హోటల్ నుండి బయటకు వస్తున్నప్పుడు అకిరా నందన్ పవన్ పక్కనే నడుస్తూ పవన్ కు సంబంధించిన జర్కిన్ ను అదేవిధంగా రెండు పుస్తకాలను చేతిలో పుచ్చుకుని పవన్ పక్కనే నడుస్తూ తాను తాను పవన్ వారసుడుని అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ఈమధ్యనే పవన్ తన కంటి ఇన్ ఫెక్షన్ కు సంబంధించి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. 
akira nandan and pawan kalyan at rented house
ఈ నేపధ్యంలో తన తండ్రి పవన్ ను చూడటానికి అకిరా నందన్ వచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. చేతిలో పుస్తకాలు పెట్టుకుని తిరుగుతున్న పొడువైన అకిరా నందన్ ను చూస్తుంటే తన తండ్రిలాగే అకిరాకు కూడ పుస్తక పఠనం పట్ల మంచి అభిరుచి ఏర్పడింది అనుకోవాలి. దీనితో రానున్న కాలంలో పవన్ అభిమానులు కోరుకునే విధంగా అకిరా నందన్ సినిమాల వైపు వచ్చి మెగా హీరోగా మారినా ఆశ్చర్యం  లేదు అని అనిపించడం సహజం..  


మరింత సమాచారం తెలుసుకోండి: