హిందీ ''బిగ్ బాస్''సీజన్-11లో బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ కాంటెస్టెంట్‌గా కొనసాగింది.  ఆ సమయంలో ఈ హీనా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకదశలో దక్షిణాది హీరోయిన్లపై దారుణంగా విమర్శలు చేసింది.   ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దక్షిణాది భామలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హీనాఖాన్ చేసి యోగా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  ‘హీనాజీ నువ్వు ముస్లిమ్ అయితే ఇలా మహిళ అర్ధనగ్నంగా యోగా చేయడం తగదు’’ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Image result for హీనాఖాన్
‘‘ముస్లిములకు నమాజ్ చేయడం మంచి యోగాలాంటిదే’’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. అయితే యోగా అనేది కులమతాలతో పోల్చుకునేది కాదని..అది అందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అని..ఎవరైనా ఆసనాలు వేసుకోవొచ్చని కొంత మంది అభిమానులు అంటున్నారు. 

అంతే కాదు ‘‘యోగా చాలా బాగా చేశావు హీనా...ఆరోగ్యం కోసం నువ్వు చేస్తున్న ప్రచారానికి అభినందనలు’’ అంటూ కొందరు నెటిజన్లు అభినందనల వర్షం కురిపించారు. మొత్తంమీద హీనాఖాన్ యోగా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ హీనాఖాన్ బెల్లీ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: