తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’చిత్రంతో కాస్త మంచి పేరు తెచ్చుకున్నాడు.  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఆ తర్వాత  సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ చిన్న దర్శక, నిర్మాతల పాలిట వరంగా మారారు. 
Image result for arjun reddy
ప్రస్తుతం విజయ్ నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్ కి సిద్దంగా ఉంది.  తాజాగా విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' సినిమా రూపొందుతోంది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో అందమైన ఈ ప్రేమకథ రూపొందుతోంది.  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  పోస్టర్ చూస్తుంటే...యూత్ ఫుల్ ఎంట్రటైన్ మెంట్ గా ఉంటుందనిపిస్తుంది.
Image result for arjun reddy geetha govindam
విజయ్ దేవరకొండ ఒక గోడకు ఆనుకుని .. మరో గోడకి తన కాళ్లను తన్నిపట్టి ఉంచాడు. అతని కాళ్లపై కథానాయిక కూర్చుని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఆమె కళ్లలోకి చూస్తూ కథానాయకుడు మురిసిపోతున్నాడు.  "నా కాళ్లు తిమ్మిరెక్కినా .. నడుము నెప్పిలేచినా .. మీ బరువు .. బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్" అంటూ ఈ పోస్టర్ లోని స్టిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: