మెగా పవర్ స్టార్ రాం చరణ్ ను ఓ టాప్ హీరోయిన్ అసలు వదిలిపెట్టడం లేదు. అతని సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆయన సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా కనీసం ఐటం సాంగ్ అయినా చేస్తానని అంటుంది. తెలుగులో లాస్ట్ ఇయర్ వరకు సూపర్ ఫాంలో ఉన్న అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.


ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అంటే.. రాం చరణ్ తో బ్రూస్ లీ, ధ్రువ సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తుంది. అప్పటిదాకా యువ హీరోలతో సినిమాలు చేస్తున్న రకుల్ బ్రూస్ లీ ఆఫర్ తో స్టార్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాతే అమ్మడికి లక్కీ ఛాన్సులు వచ్చాయి. చరణ్ తో ధ్రువ సూపర్ హిట్ అందుకుంది రకుల్. 


రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో భరత్ భామ కియరా అద్వాని నటిస్తుంది. ఆ సినిమాలో ఐటం సాంగ్ కు రకుల్ ను ఎంపిక చేశారట. చెర్రి సినిమాలో ఐటం సాంగ్ అయినా ఓకే చెప్పేసిందట రకుల్ ప్రీత్ సింగ్. ఈ సాంగ్ కోసం అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 


రాం చరణ్ తో ఐటం సాంగ్ చేసి మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు సంపాదించాలని చూస్తుంది రకుల్. ఈమధ్య ఫోటో షూట్స్ తో సెగలు రేపేలా చేస్తున్న అమ్మడు చెర్రిపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఆ రీజన్ ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: