ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలు బాగానే వస్తున్నాయి.  అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు రావడం..అవి కూడా మంచి విజయాన్ని సాధించడంతో దర్శక, నిర్మాతలు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు.  తాజాగా తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలకు నిర్మాణ సారధ్యం వహించిన దాదాఫాల్కె అవార్డు గ్రహీత డి.రామానాయుడు జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరపైకి వస్తుందని ఆ మద్య పుకార్లు వినిపించాయి. 
Image result for d ramanaidu family
తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..తన తండ్రి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడిపై బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని నిర్మాత తేల్చి చెప్పారు.  ఆయన నిర్మాణ సారథ్యంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు.
Image result for d ramanaidu family
ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడారు. తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమన్నారు. ‘మహానటి’, ‘సంజు’ వంటి బయోపిక్స్‌కు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాలలో పలు కోణాలను చవిచూశారని సురేశ్ బాబు పేర్కొన్నారు.

అయితే బయోపిక్ లు అంటే పూర్తి స్థాయిలో వారి జీవిత కథలే ఉండవని అందులో ఎదో ఒక కల్పితం ఉండాలని..అలాంటి కల్పితాలు తాను చేయలేనని..తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ వినరు, చూడరని వివరించారు. ఇక తన బ్యానర్ లో కొత్త వారిని, కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేస్తామని, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను మరింత నాణ్యంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తరుణ్ భాస్కర్‌లో ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన ఉందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: