2019 ఎన్నికల వేడి ఇప్పటి నుండే మొదలవగా రాజకీయ పార్టీలు తమ కార్యచరణలు మొదలుపెట్టారు. తెలంగాణాలో ఎలా ఉన్నా ఆంధ్రాలో ఈసారి పోరు మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒకే వేదిక మీద రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. 


చిరు, బాలయ్య ఇద్దరు సూపర్ స్టార్స్.. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాని రాజకీయ పరంగా కొన్ని అవాంతరాలు ఉన్నాయి. కులాల కొట్లాట గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అయితే ఈమధ్య యెల్లో మీడియా దగ్గర ఉండి పవన్ మీద పనిగట్టుకుని విమర్శలు చేస్తుందని అప్పట్లో పవన్ నానా హంగామా చేశాడు.


అవన్ని పక్కన పెడితే మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత సినిమా ఆడియోకి నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా వస్తున్నాడట. మెగా హీరో సినిమాకు బాలయ్య చీఫ్ గెస్ట్ అది కూడా చిరంజీవితో పాటుగా విశిష్ట అతిథిగా బాలయ్య వస్తున్నాడు. కచ్చితంగా ఈ కాంబినేషన్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అని చెప్పొచ్చు.


రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న కళ్యాణ్ దేవ్ విజేత సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ఆడియోకి బాలయ్య రావడం వెనుక నిర్మాత సాయి కొర్రపాటి ఉన్నాడని టాక్. విజేత సినిమా నిర్మాత ఆయనే కాబట్టి ఆయనే బాలయ్యని గెస్ట్ గా తీసుకొస్తున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: