ఢీ-10లో యాంకర్ గా రష్మి, సుధీర్ లతో పాటుగా వర్షిణి కూడా అందరిని ఆకట్టుకుంటుంది. బాగా సినిమాలు చూసే వారికి వర్షిణిని ఎక్కడో చూసిన జ్ఞాపకం ఉంటుంది. అయితే ఆమె పేరు అప్పుడు వర్షిణి కాదు కదా అన్న డౌట్ వస్తుంది. వారు ఊహించినట్టుగానే యాంకర్ వర్షిణి అసలు పేరు శామిలి సౌందరాజన్.


చందమామ కథలు, బెస్ట్ యాక్టర్స్ సినిమాల్లో నటించింది వర్షిణి. బెస్ట్ యాక్టర్స్ సినిమా దర్శకుడు అరుణ్ పవార్ తో ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్న వీరి జంట పెళ్లిపీటలెక్కక ముందే విడిపోయారు. ఇక ఆ తర్వాత వర్షిణిగా పేరు మార్చుకున్న అమ్మడు షార్ట్ ఫిలిమ్స్, బుల్లితెర షోలు చేస్తూ వచ్చింది.


ఇక ఇప్పుడు ఢీ 10 యాంకర్ గా అందరికి ఫేవరెట్ అయ్యింది. ఢీ 10లో తన క్యూట్ యాంకరింగ్ తో అలరించిన వర్షిణి హాలీడే ట్రిప్పులకు వెళ్తే మాత్రం బికిని లుక్స్ తో అదరగొడుతుంది. బుల్లితెర మీద చక్కగా కనిపించే అమ్మడులో అసలు అందాలు హాలీడేస్ లో ఆమె పెట్టే బికిని పిక్స్ లో చూడొచ్చు.


ప్రస్తుతం బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తున్న వర్షిణి ఛాన్స్ వస్తే సినిమాల్లో నటించేందుకు సై అంటుంది. మునుపటి కన్నా కాస్త స్లిమ్ లుక్ లో ఆకట్టుకుంటున్న వర్షిణి సరైన ఛాన్స్ వస్తే సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధం అంటుంది. ఇప్పటికే బుల్లితెర నుండి అనసూయ, రష్మిలు వెండితెర మీద కూడా మంచి హంగామా చూపిస్తున్నారు.    
 



మరింత సమాచారం తెలుసుకోండి: