ఈ మద్య బిగ్ బాస్ లో తారల సందడి నెలకొంది.  తెలుగు లో మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ గా ఎంట్రీ ఇచ్చారు.  బిగ్ బాస్ హౌజ్ సభ్యులు కూడా సినీ తారలు కావడంతో మంచి మోడ్ లో మొదలై..హ్యాపీ ఎండింగ్ తో ముగిసింది.  బిగ్ బాస్ బాలీవుడ్ లో అయితే పదకొండు సీజన్ లు పూర్తి అయ్యాయి.  అక్కడ ప్రతిసారి ఎన్నో వివాదాలతో ముగిస్తుంది.   
Image result for big boss 2 tamil janani aishwarya
అయితే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభించింది.  ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్ బాస్ 2 మొదలైంది.  తెలుగు లో రెండో వారం కొనసాగుతుండగా నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా తన వంతు కృషి చేస్తున్నాడు.  తమిళంలో బిగ్ హోస్ట్ గా విశ్వనటుడు కమల్ హాసన్ కొనసాగుతున్నారు. 
Image result for big boss 2 tamil janani aishwarya
తాజాగా తమిళ బిగ్‌బాస్‌2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్‌మేట్స్‌ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్‌మేట్స్‌ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్‌ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది.  ఐశ్వర్య, రమ్య ట్విన్స్‌లాగా నటించి హౌస్‌మేట్స్‌ అడిగిన ప్రశ్నలకు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పారు. 
Bigg Boss 2 Tamil, episode 6: Janani kisses Aishwarya on the show.
ముంతాజ్‌, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు. మొత్తానికి తమిళ్‌ బిగ్‌బాస్‌2 షో రోజురోజుకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. అంతకుమించి అనిపించేలా షో సాగిపోతోంది.  కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: