నాని హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 2’ సిరీస్ జూనియర్ గతంలో హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ సిరీస్ తో పోలుస్తున్న నేపధ్యంలో నాని ఈషోను సమర్ధవంతంగా నిర్వహించ లేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ నిన్నరాత్రి ప్రసారం అయిన ‘బిగ్ బాస్’ వీకెండ్ షోలో తనదైన పట్టును సాధించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసాడు. గతంలో ‘బిగ్ బాస్’ షోను నిర్వహించిన జూనియర్ ఈకార్యక్రమంలోని హౌస్ మేట్స్ తో అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడి హౌస్ మేట్స్ చేసిన పొరపాట్ల విషయం దగ్గరకు వచ్చే సరికి చాల కఠినంగా మారిపోయి హౌస్ మేట్స్ పై తన ఆధిపత్యాన్ని చూపించేవాడు. 
Nani is the new host of Bigg Boss Telugu, Season 2. The first season was hosted by Jr NTR.
ఇప్పుడు అదే టెక్నిక్ ను నాని అనుసరిస్తూ నిన్న ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షోలో పార్టిసిపెంట్స్ పై తన ఆదిపత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా ఈషోలోని పార్టిసిపెంట్స్ చేసిన తప్పులను వివరిస్తూ చాల ధృడంగా నిన్నటి షోలో నాని కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. దీనికితోడు ‘బిగ్ బాస్’ షో నుండి ఎలిమినేట్ అయిన సంజన నానీని టార్గెట్ చేస్తూ మీడియా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రభావంతో తన తీరు మార్చుకుని నాని ఇలా హౌస్ మేట్స్ పై కమాండర్ గా మారిపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
Nani
దీనితో నిన్నటి షోలో మారిన నాని తీరు చూసి హౌస్ మేట్స్ కూడ ఆశ్చర్యపడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈరోజు ప్రసారం కాబోతున్న ఎలిమినేషన్ రౌండ్ కు సంబంధించిన కార్యక్రమం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ‘బిగ్ బాస్ 2’ కు సంబంధించిన సెట్ లో షూట్ చేయడం జరిగింది. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో సామాన్యుడుగా వచ్చిన నూతన్ నాయుడు ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 
Nani tak es upon the host’s duty for Bigg Boss 2 Telugu in the new season.
ఇది ఇలా ఉండగా ఈకార్యక్రమంలో పాల్గొంటున్న దీప్తి సునయనకు ఆమె ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకునే విధంగా సుమారు 3 కోట్ల ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈమె మళ్ళీ ప్రొటక్షన్ జోన్ లోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రసారం అయిన ఈషోకు సంబంధించిన ఎపిసోడ్స్ లో దీప్తి సునయన ఎటువంటి సంచలనాలు చేయకపోయినా ఆమెకు ఈ రేంజ్ లో ఓట్లు రావడం అందరికి షాక్ ఇస్తోంది. దీనితో ఈరోజు ప్రసారం కాబోతున్న ‘బిగ్ బాస్ 2’ ఎలిమినేషన్ షోలో మరిన్ని సంచనాలు ఉండటం ఖాయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: