బిగ్ బాస్-2 రెండో వారం రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా హౌజ్ లో లక్సరీ బడ్జెట్ టాక్స్ లో హౌజ్ మెట్స్ కొట్లాటలు అందరికి తెలిసిందే. ఫైనల్ గా నూతన్ నాయుడు, తనీష్ ల గొడవ మధ్యలో కౌశల్ ఇన్వాల్వ్ మెంట్ అంతా హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఎలిమినేషన్ లో కౌశల్, బాబు గోగినేని, నూతన్ నాయుడు, దీప్తి సునైనా, గణేష్ లు ఉన్నారు.


అయితే హౌజ్ లో అందరికి శత్రువుగా మారిన కౌశల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. దీప్తికి క్రేజీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమె ఉన్నట్టే. బాబు గోగినేనికి కూడా భారీ సపోర్ట్ వచ్చిందని తెలుస్తుంది. ఇక మళ్లీ ఎటొచ్చి ఇద్దరు కామన్ మెన్ మధ్య పోటీ వచ్చింది. నూతన్ నాయుడు, గణేష్ ల మధ్య ఈవారం ఎలిమినేషన్ ఉంటుంది.


ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవుతారు. లాస్ట్ వీక్ కూడా నూతన్ నాయుడు, సంజనాల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. స్టోర్ రూం లోకి నూతన్ నాయుడు, కంఫెషన్ రూంలోకి సంజనాని పంపించి కంఫెషన్ రూంలో ఉన్న వారు సేఫ్ అనేశాడు నాని. తీరా వెళ్లి చూస్తే అక్కడ నూతన్ నాయుడు ఉన్నాడు.


ఈ వారం నూతన్, గణేష్ ల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ఇంట్లో కొనసాగుతారు అన్నది చూడాలి. గణేష్ కంటెస్టంట్స్ కు పోటీ ఇవ్వడం లేదు. నూతన్ నాయుడు దాదాపు తానే ఎలిమినేట్ అని ఫిక్స్ అయ్యాడు. రెండు వారాలు సైలెంట్ గా ఉన్న నూతన్ నాయుడు ఒక్కసారి తన విశ్వరూపం చూపించేశాడు. మరి ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: