గతకొంత కాలంగామీడియాకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ గత కొద్ది రోజులుగా మీడియాకు మళ్ళీ సంచలనంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం తాను త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన రేణు దేశాయ్ తనకు మరొక తోడు దొరికిందని అని అర్ధం వచ్చేలా చెపుతూ ఒక స్త్రీ ఒక వ్యక్తి చేయి పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. 
 గొడవలైపోతాయి అంటున్న పవన్ అభిమానులు
అది చాలదు అన్నట్లుగా రేణు దేశాయ్ ఇన్‌ స్టాగ్రామ్ మరొక ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది. తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని అర్ధం వచ్చే రీతిలో చేతులకు గోరింటాకుతో ఒక స్త్రీ ఒక పురుషుడుతో చేయి చేయి కలిపిన ఫోటోను పెట్టి ఆ ఫోటోలోని వ్యక్తులు మ్యారేజ్ రింగ్స్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసి ‘ఎంగేజ్డ్' అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టింది. 
వారి ప్రవర్తనపై చింతించిన రేణు దేశాయ్
దీనితో రేణు దేశాయ్ మరొక వ్యక్తితో జీవితం పంచుకుంటోంది అన్న విషయం స్పష్టమవుతోంది. అయితే రేణు దేశాయ్ ఆ వ్యక్తి వివరాలు ఏమి ఇప్పటి వెల్లడించలేదు. అయితే ఇదే ఫోటోతో రేణు దేశాయ్ కూతురు మరొక అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోను కూడ షేర్ చేయడంతో ఆ అమ్మాయి రేణు దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి కూతురా ? అన్న సందేహం కలగడం సహజం. 
అందుకే అతడి వివరాలు గోప్యంగా
అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం చాలామంది పవన్ అభిమానులకు ఇష్టం లేదు అని తెలుస్తోంది. ‘మీరు రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌. నా దేవుడికి ఎలాంటి సమస్యలు రాకూడదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి.' అని ఒక అభిమాని కామెంట్ చేసినప్పుడు రేణు దేశాయ్ సహనం కోల్పోకుండా ‘ఇలాంటి క్రేజీ అబ్బాయిలు ఇంట్లో వారి తల్లులు, సోదరీమణులతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి నేను చింతిస్తున్నాను' అని కామెంట్ చేసింది. దీనితో కొద్ది రోజుల పాటు రేణు దేశాయ్ రెండవ భర్త వివరాలను గోప్యంగా ఉంచే అవకాసం కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: