భారీ అంచనాల మధ్య విడుదలైన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా దారుణమైన ప్లాప్ చవిచూడడంతో అల్లు అర్జున్ తన తర్వాత సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా విడుదలైన నాపేరు సూర్య సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నెక్స్ట్ చేయబోయే సినిమాపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు బన్నీ.
Image result for allu arjun
మొన్నటి వరకు వరుస విజయాలతో ఉన్న అల్లు అర్జున్ అదే జోరు కొనసాగించాలని తాను తర్వాత చేయబోయే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఈ క్రమంలో గతంలో రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ...ప్రస్తుతం సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో భారీ బడ్జెట్ లో సైరా సినిమా తీస్తున్నాడు.
Image result for allu arjun
ఈ సినిమాను త్వరలోనే పూర్తీ చేసి అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు సూరి. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయట. ఈ నేపథ్యంలో గతంలో హిట్టయిన రేసుగుర్రం సినిమా కంటే భారీ హిట్టు కొట్టాలని ఇద్దరు మంచి కసిమీద వున్నారు.
Related image
దీంతో గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రేసుగుర్రం సినిమా భారీగా హిట్ అవడంతో….మళ్లీ వీరిద్దరూ కలిసి మరొక సినిమా చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు...మరోపక్క బన్నీ ఈ గ్యాప్ లో వేరే సినిమా ఏదైనా చేద్దామా వద్దా అనే డైలమాలో పడిపోయాడు. మరి ఈ మధ్యలో బన్నీ ఏదైనా సినిమా మొదలుపెడతాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: