మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘విజేత’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన చిరంజీవి తన అల్లుడు గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తన అల్లుడు కళ్యాణ్ దేవ్ కు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఉన్న విపరీతమైన ఇష్టాన్ని తెలియచేస్తూ తన అల్లుడి పై ప్రశంసలు కురిపించాడు. 

ఫిలిం ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది అని అంటూ ఎవరు వచ్చినా ఇండస్ట్రీ అభ్యంతరం చెప్పదనీ అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వ్యక్తుల వ్యక్తిత్వం కృషి బట్టి మాత్రమే ఇండస్ట్రీలో విజయాలు ఉంటాయి అంటూ తన మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కళ్యాణ్ దేవ్ కు సరిపోదు అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తన అల్లుడు కళ్యాణ్ దేవ్ చాల అందంగా ఉండటమే కాకుండా సినిమా హీరోగా రాణించడానికి కావలసిన లక్షణాలు అన్నీ కళ్యాణ్ దేవ్ కష్టపడి సమకూర్చుకున్నాడు అంటూ తన అల్లుడుపడ్డ కష్టాన్ని వివరించాడు చిరంజీవి. 

తనకు నటుడుగా ఎంతో పేరు తెచ్చిపెట్టిన ‘విజేత’ మూవీ పేరును తిరిగి కళ్యాణ్ దేవ్ తన సినిమాకు ఉపయోగించుకోవడంలో చాల సాహసం ఉంది అని చెపుతూ తన మూవీ టైటిల్ వెనుక ఉన్న మ్యాజిక్ ను వివరించాడు. ఈసినిమాకు దర్సకత్వం వహించిన రాకేష్ శశి కళ్యాణ్ దేవ్ ను ఒక వజ్రంలా సానపెట్టాడు అంటూ ఈమూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సింధిల్ కుమార్ తన అల్లుడుని చాల అందంగా చూపెట్టి తనకే షాక్ ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు మెగా స్టార్. 

ఇక తనఉపన్యాసం చివరిలో చిరంజీవి ఒక మెగా ట్విస్ట్ ఇస్తూ ఈమూవీ జూలై 12న విడుదల కాబోతోంది అని చెపుతూ నిర్మాత సాయి కొర్రపాటి సెంటిమెంట్ వల్ల ఇప్పటి వరకు ఈసినిమా రిలీజ్ డేట్ పై ఎన్నో అపోహలు వచ్చాయని చెపుతూ సాయి ధరమ్ తేజ్ కళ్యాణ్ దేవ్ సినిమాల మధ్య పోటీ ఉండదు అన్న సంకేతాలు ఇచ్చాడు. ‘ఈగ’ సెంటిమెంట్ ను నమ్ముకుని కళ్యాణ్ దేవ్ ‘విజేత’ ను జూలై 6న విడుదల కావడం లేదు అని క్లారిటీ ఇస్తూ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్యూ’ మూవీకి మెగా పోటీ లేకుండా లైన్ క్లియర్ చేసాడు. దీనితో చిరంజీవి తన అల్లుడు మేనల్లుడుల సమన్యాయం చేసాడు అంటూ కామెంట్స్ ఆకార్యక్రమంలో వినిపించాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: