మెగా ఫ్యామిల నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు.  ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తే ఎన్నో అంచనాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.  నటన మాత్రమే కాదు..ఫైట్స్, డ్యాన్స్ లో ఎంతో ప్రత్యేకత చాటుకుంటున్నారు.  అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ డ్యాన్స్, ఫైట్స్ ల పరంగా సత్తా చాటుతూ వస్తున్నారు. 
Image result for kalyan dav Vijetha
అయితే ఏ హీరో ఎంట్రీ ఇచ్చినా ఎవరూ ఎవరికి పోటీగా ఉండరు.  తాజాగా  'విజేత 'ను జూలై 6వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దాంతో మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరి హీరోల సినిమాలు పోటీ పడనున్నాయా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. 
Image result for kalyan dev vijeta still
దాంతో కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమాను జూలై 12వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత సాయి కొర్రపాటి నిర్ణయించుకున్నారు. చిరంజీవి సూచనమేరకే ఆయన ఈనిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. చిరూ చెప్పడం వల్లనే ఆయన 'విజేత'ను 12వ తేదీకి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించిన సంగతి తెలిసిందే.  దాంతో మెగా ఫ్యాన్స్ హ్యాగా ఫీల్ అవుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: