ఈ సంవత్సరం బిగ్ బాస్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.  బిగ్ బాస్ 1 సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  అప్పట్లో బిగ్ బాస్ హౌజ్ వచ్చిన కంటెస్టంట్లు చిత్ర పరిశ్రమలో చేసిన సెలబ్రెటీలు కావడం విశేషం.  అయితే ఈ సారి పదహారు మంది లో 13 సెలబ్రెటీలు రాగా, ముగ్గురు సామాన్యులు ఎంట్రీ ఇచ్చారు.  బిగ్ బాస్ 2 లో సామాన్యులు రావడం పై మంచి స్పందన వచ్చింది..కానీ ఎలిమినేషన్ పర్వం కూడా ఆ సామాన్యుల నుంచే మొదలు కావడం పై కాస్త నిరాశ కలుగుతుంది. 
Nani ended the show by stressing on the fact that anything can happen in Bigg Boss and the housemates have to be ready to accept the challenge.
నిజానికి ఈ వారం కౌశల్ ఎలిమినేషన్ ఖాయమని చివరి వరకు అందరూ భావించినా అనూహ్యంగా హౌస్‌లో మొన్న జరిగిన గొడవ కారణంగా ప్రేక్షకుల్లో అతడిపై సానుభూతి పెరిగి విపరీతంగా ఓట్లు పడ్డాయి. దీంతో కౌశల్ బతికిపోయి నూతన్ నాయుడు బలయ్యాడు. గతవారం సంజన హౌస్ నుంచి బయటకు రాగా, ఈసారి నూతన్ నాయుడు బయటకొచ్చాడు. దీంతో హౌస్‌లో సామాన్యుడి కోటాలో ఇక మిగిలింది ఒక్క గణేశ్ మాత్రమే. శనివారం నాటి షో కాస్త గంభీరంగా అనిపించగా, ఆదివారం ఉత్సాహంగా, సరదాగా సాగింది.
Image result for bigg boss telugu twitter
ఇదిలా ఉంటే బగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ల పర్వం సామాన్యులే ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిగ్ బాస్ లో సెలబ్రెటీలు అంత సేఫ్ జోన్లో ఉంటారా..? మొదట సంజన, నిన్న నూతన్ నాయుడు..రేపు మళ్లీ సామాన్యుడేనా..లేక సెలబ్రెటీనా అన్ని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బిగ్‌ బాంబ్‌’ను తన స్నేహితుడైన కౌశల్‌పై ప్రయోగించి వెళ్లిపోయాడు. కౌశల్‌కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆ బాంబును అతడిపై ప్రయోగించినట్టు నాయుడు తెలిపాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: