‘రంగస్థలం’ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాల ట్రెండ్ కు తెర లేపింది. ఈమూవీ స్పూర్తితో ఇప్పుడు చాలామంది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నాని త్వరలో మొదలు పెట్టబోతున్న ‘జెర్సీ’ సినిమా కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న మూవీ అని వార్తలు వస్తున్నాయి. 
Prabhas
అయితే ప్రభాస్ వీరందరికన్నా మరో అడుగు వెన్నక్కు వెళ్లి జిల్ డైరక్టర్ రాధాకృష్ణ డైరక్షన్ లో ‘సాహో’ తరువాత చేయబోతున్న మూవీ కథ 1970 కాలంనాటి కథ అని తెలుస్తోంది. ఈసినిమా కథ అంతా ఇటలీలో జరిగే నేపధ్యంలో ఈ లవ్ స్టోరీ షూటింగ్ అంతా ఇతలీలోనే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. 
Prabhas
1970 కాలంనాటి ప్రేమకథ కావడంతో ఆకాలం తిరిగి మనకు కనిపించే విధంగా భారీ సెట్లు ఈమూవీలో ఉంటాయని అంటున్నారు. అందువల్లనే ఈసినిమాకు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. ఈసినిమా కథలో ప్రేక్షకులకు థ్రిల్ కలగడానికి కొంత ఫాంటసీ కూడ క్రియేట్ చేస్తున్నట్లు టాక్. 
Prabhas
దీనికోసం ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా 1970 కాలంనాటి రోజులలో అప్పటి యూత్ ఎలా ఉండేవారు అన్న విషయాలను తెలుసుకోవడం కోసం క్యాలెండర్ పేజీలను వెనక్కు తిప్పుతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని ఎత్తి పరిస్తుతులలోను వచ్చే ఏడాది విడుదల చేసి ఒకే ఏడాదిలో తన ‘సాహో’ తో పాటు ఈ వెరైటీ ప్రేమ కథతో కూడ తమ అభిమానులకు జోష్ ను ఇవ్వాలని ప్రభాస్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం..  



మరింత సమాచారం తెలుసుకోండి: