కొంత మందికి కొన్ని తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం..వాటి కోసం ఎన్ని పాట్లైనా పడుతుంటారు.  ప్రపంచంలో స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు.  అలాంటిది  తమకు ఇష్టమైన స్వీట్లు మన కళ్లెదురు ఉంటే..ఆ ఆనందానికి అవధులు ఉండవు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న కాజల్ కూడా తనకు ఇష్టమైన స్వీట్లు కనిపించే సరికి చిన్న పిల్లలా మారిపోయింది.  లక్ష్మీ కళ్యానం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో  గత కొంత కాలంగా బిజీ హీరోయిన్ గా మారింది.  ఇక మెగా ఫ్యామిలీ లో టాప్ హీరోలందరి సరసన  నటించింది. 
Image result for kajal'
అంతే కాదు‘ఖైదీ నెంబర్ 150’ తో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడం..ఆయన సరసన నటించే లక్కీ చాన్స్ కాజల్ కొట్టేసింది.  ఈ సినిమ ఘన విజయం సాధించడంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.  టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ ఆసక్తికర ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఓ స్వీట్ షాపులోకి వెళ్లిన కాజల్, అక్కడ ఉన్న జిలేబి చూసి నోరు తెరిచింది.
Image result for kajal'
ఆ జిలేబి అంతా తినేస్తానంటున్నట్టుగా నోరు తెరిచిన కాజల్ ఫొటోను అక్కడున్న వాళ్లెవరో తీశారు. ఆ ఫోటో కాజల్ తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఒక్కసారే వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఓ సినిమాలో కాజల్ నటిస్తోంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: