మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘విజేత’ ట్రై లర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక చిత్ర ట్రైలర్ చూస్తుంటే తండ్రి , కొడుకుల మధ్య సాగె కథ నేపథ్యంలో తెరకెక్కిందిగా అనిపిస్తుంది . తండ్రి పాత్రలో మురళీశర్మ నటించగా కొడుకు పాత్రలో కళ్యాణ్ దేవ్ నటించాడు .  చిరు ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారాహి చలనచిత్రం లాంటి పేరున్న బ్యానర్ అతడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

చిరు సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ ను కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు పెట్టి ఫ్యాన్స్ ఈజీగా కనెక్టయ్యేలా ప్రయత్నించారు. విజేత సినిమాలో కళ్యాణ్ దేవ్ ఓ మిడిల్ క్లాస్ యంగ్ స్టర్ పాత్ర చేశాడు. ఉద్యోగం తెచ్చుకోవడానికి నానా తంటాలు ఇంట్లో నాన్న దగ్గర మాటలు పడే ఓ మామూలు కుర్రాడిగానే కనిపించనున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మొత్తం కుర్రాళ్ల సరదాలు.. మధ్యలో అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెను ఇంప్రెస్ చేయడానికి పాట్లు.. చివరిలో గుండె బరువెక్కించే తండ్రి కొడుకుల ఎమోషన్ తో చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.
Image result for విజేత ట్రైలర్
‘బుద్ధుడు కూడా ఇల్లొదిలి కూడా పోయాకే గొప్పోడయ్యాడు’’.. ‘‘మీలో ఎక్కువ మార్కులు చాలా తక్కువమంది ఉంటారు.. నాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాళ్లే ఎక్కువమంది ఉంటారు’’ వంటి డైలాగులు మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్టవుతాయి.  మొత్తంమీద ట్రయిలర్ వరకు చూసుకుంటే చిన్నల్లుడు మెప్పించాడనే అనిపిస్తుంది.రాజీవ్ కనకాల , సత్యం రాజేష్ , సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: