నిన్నరాత్రి మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజేత మూవీ ఆడియో ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుత కాలంలో నిర్మాతల పరిస్థుతుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రోజులలో నిర్మాతలకు విపరీతమైన విలువ ఉండేదని ఆరోజులలో నిర్మాత తండ్రి పోషిస్తూ తన అభిరుచి మేరకు మంచి సినిమాలను తీసేవాడని అంటూ చిరంజీవి ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నాడు. 
మొదట భయపడ్డా
అయితే ప్రస్తుత కాలంలో నిర్మాత క్యాషియర్ లా మారిపోయి తన ఉనికిని కోల్పోతున్నాడు అంటూ చిరంజీవి నిర్మాతల దృష్టిని బహిరంగంగా బయట పెట్టాడు. అంతేకాదు నిర్మాతలు అంతా కలిసి ఒక సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ అనవసరపు పోటీ వాతావరణంలో నిర్మాతలు చాల వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయ పడ్డాడు మెగా స్టార్. 
ఎలాంటి ఇమేజ్ లేదు
ఇదే సందర్భంలో తాను వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్న సమయంలో ‘విజేత’ సినిమా చేసిన సందర్భాన్ని వివరిస్తూ అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న భయం తనకు అప్పట్లో కలిగిందని చెపుతూ తన అల్లుడు కళ్యాణ్ దేవ్ తనలాంటి సాహసమే మళ్ళీ చేస్తూ ఉండటం తనకు ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ఈసినిమాలోని తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు తన ‘విజేత’ సినిమాలోని కొన్ని సీన్స్ ను గుర్తుకు చేస్తాయి అంటూ కళ్యాణ్ దేవ్ ‘విజేత’ పై తన ‘విజేత’ ప్రభావం ఉంది అన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు చిరంజీవి.  
కళ్యాణ్ దేవ్ గురించి
కళ్యాణ్ దేవ్ కు అందమైన ముఖ వచ్చస్సు ఉందని చెపుతూ చిరంజీవి ఈసినిమా పై అంచనాలు పెంచడానికి తనవంతు ప్రయత్నాలు చేసాడు. ఈమూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపధ్యంలో కళ్యాణ్ దేవ్ తన మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించే ఆస్కారం ఉంది అంటూ ఈకార్యక్రమానికి వచ్చిన చాలామంది అతిధులు కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: