మొన్నటి వరకు డ్రగ్స్ తర్వాత కాస్టింగ్ కౌచ్..ఇప్పుడు సెక్స్ రాకేట్ దందా..ఇలా టాలీవుడ్ కొంత కాలంగా రక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  ఒకప్పుడు భారత దేశంలో టాలీవుడ్ కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు..ఈ మద్య రాజమౌళి తీసిని బాహుబలి సినిమాలతో ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించింది.  ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి, బాహుబలి 2  సినిమాలకు వచ్చన క్రేజ్ చూసి ఇతర ఇండస్ట్రీలు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి టాలీవుడ్ పై ఈ మద్య ఎన్నో నిందలు పడుతున్నాయి. 
Image result for సురేఖా వాణి
ఇక అమెరికాలో సెక్స్ రాకేట్ దందా చేస్తున్న కిషన్ దంపతులు టాలీవుడ్ సెలబ్రెటీలను ఈవెంట్స్ పేరు తో విసా పంపించి వారిచే వ్యభిచారం చేయించారని..అమెరికా పోలీసులు ఆరోపిస్తున్నారు.  ఇప్పుడు అమెరికా వెళ్తున్న సెలబ్రెటీలను ఒక రకంగా చూడటం మొదలు పెట్టారు అక్కడి పోలీసులు.  రీసెంట్ గా మెహ్రిన్ కౌర్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆమెను కొంత సేను రక రకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.  తర్వాత షూటింగ్ కోసం వచ్చారిన క్లారిటీ తీసుకున్న తర్వాత విడిచి పెట్టారు. 
Image result for సురేఖా వాణి
అంతే కాదు వివిధ తెలుగు అసోసియేషన్ల ఆహ్వానాలతో అమెరికా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటున్న వారు యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలో తిరస్కరణకు గురవుతున్నారు.  రెండు రోజుల క్రితం, అంటే 22వ తేదీన అమెరికా వెళ్లేందుకు బీ1బీ2 (ట్రావెల్ వీసా) వీసా నిమిత్తం డ్యాన్సర్, టీవీ నటి సురేఖా రాణి యూఎస్ కాన్సులేట్ కు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్లారు.
Image result for సురేఖా వాణి
అమెరికాకు ఎందుకు వెళుతున్నారని అడుగగా, 'ఆటా సదస్సు కోసం' అని ఆమె చెప్పగానే తిరస్కరణకు గురైంది.  అంతే కాదు  వీసాలను తిరస్కరిస్తున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, తానా, ఆటా, నాటా సదస్సులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే వారిలో 75 శాతం మంది వరకూ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలిస్తుంటారని, ఇప్పుడు 90 శాతం మందికి వీసా ఇచ్చేందుకు కాన్సులేట్ నిరాకరిస్తోందని అధికారులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: