Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 6:28 am IST

Menu &Sections

Search

పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘పంతం’ట్రైలర్ అదుర్స్!

పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘పంతం’ట్రైలర్ అదుర్స్!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘పంతం’ట్రైలర్ అదుర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలోకి వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో గోపిచంద్.  ప్రముఖ విప్లవ దర్శకులు టి.కృష్ణ తనయుడైన గోపిచంద్ ‘తొలివలపు’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.  ఆ తర్వాత తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘జయం’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో విలన్ గా తన పవర్ ఏంటో చూపించాడు గోపిచంద్.  దాంతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించిన గోపి చంద్ వర్షం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించి హీరోలతో సమానం క్రేజ్ తెచ్చుకున్నాడు. 

pantham-movie-gopichand-mehreen-sri-sathya-sai-art

 ఆ తర్వాత హీరోగా కొనసాగుతూ వస్తున్న గోపిచంద్ యాక్షన్ తరహా చిత్రాల్లో నటిస్తూ వచ్చారు.  ఆ మద్య ‘లౌక్యం’తో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు గోపిచంద్.  ఇక లౌక్యం సక్సెస్ తర్వాత వరుసగా అపజయాలు పొందుతూ వచ్చాడు. మొదటి నుంచి కూడా గోపీచంద్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాలే ఆయనకి ఎక్కువగా విజయాలను తెచ్చిపెట్టాయి.