టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన డివివి దానయ్య తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో కొంతమంది దర్శకుల దగ్గర ఉన్న కథలను విన్నాడట. ఫైనల్ గా తేజ చెప్పిన లైన్ నచ్చడంతో తేజ డైరక్షన్ లోనే ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 


డెబ్యూ హీరోకి స్టార్ హీరోయిన్ అయితే పర్ఫెక్ట్ అని భావించారట. ఆల్రెడీ బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం సమంత, తమన్నాలనే ఎంచుకున్నాడు. ఆ క్రమంలో దానయ్య డివివి ఏకంగా స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. అయితే దానయ్య తనయుడు మాత్రం కాజల్ హీరోయిన్ గా కావాలని చెప్పాడట.


సౌత్ లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఓ కుర్ర హీరో పక్కన అంటే కష్టమే కాని కుర్రాడు మాత్రం తన పక్కన కాజల్ కావాల్సిందే అంటున్నాడట. నిర్మాత తనయుడు కాజల్ అగర్వాల్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అయితే ఎలాగు కెరియర్ మంచి స్వింగ్ లో ఉంది కాబట్టి కాజల్ కూడా అందుకు సై అన్నదని తెలుస్తుంది.


ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడించనున్నారు. సినిమా కోసం కాజల్ కు భారీగానే ఇస్తున్నారని తెలుస్తుంది. కాజల్ తో కుర్ర హీరో రొమాన్స్ మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. సొంత కొడుకు సినిమా కాబట్టి దానయ్య ఖర్చుకి వెనుకాడడు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: