‘బిగ్ బాస్ 2’ షోలో సామాన్యుడుగా ఎంట్రీ ఇచ్చి రెండవవారం ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు నిన్న ఒకప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ షోలో అసలు ఏమిజరుగుతోంది తాను ఎలిమినేట్ అవ్వడానికి గలకారణాలను పవన్ కళ్యాణ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి ఎన్నో విషయాలను షేర్ చేసాడు. తాను సామాన్యుడుని కాబట్టి తనను ఎలిమినేట్ చేసారు అన్న వాదనతో తాను అంగీకరించననీ ప్రేక్షకులు ఎవరికీ ఓట్లు వేస్తారో వారే ఈషోలో కొనసాగుతారు అంటూ కౌశల్‌ కు జరిగిన సంఘటన వల్ల ఓట్లు కౌశల్ కు ఎక్కువగా రావడంతో తాను ఎలిమినేట్ అయిన విషయం తనకు తెలుసు అంటూ ‘బిగ్ బాస్’ షో పై వస్తున్న రూమర్స్ ను ఖండించాడు నూతన్ నాయుడు. 
సంజన వాదనతో విబేధించిన నూతన్
ఇదే ఇంటర్వ్యూలో తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి వివరిస్తూ గతఎన్నికలలో తాను ‘ప్రజారాజ్యం’  పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని బయట పెట్టాడు. అయితే ప్రస్తుతం తనకు ‘జనసేన’లో ఎటువంటి సభ్యత్వం కానీ పదవులు లేవు అనిఅంటూ తను పవన్ కళ్యాణ్ వీరభక్తుడుని అన్న విషయం చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంలో నూతన్ నాయుడు పవన్ కళ్యాణ్‌ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ పవన్  భగవంతుడి స్వరూపం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 
తాను పవన్ తో గతంలో కొనసాగించిన సాన్నిహిత్యంతో తెలుసుకున్న విషయాలను వివరిస్తూ అలాంటి వ్యక్తి ప్రస్థుత సమాజంలో ‘న బూతో న భవిష్యత్’ అంటూ పెద్దపెద్ద పదాలు వాడాడు.
పవన్ కళ్యాణ్‌కు వీర భక్తుడిని
‘బిగ్ బాస్’ షో నుండి ఎలిమినేట్ అయిన సంజన చెప్పినట్లుగా బిగ్ బాస్ షోలో రాజకీయాలు ఉండవని కేవలం అందరూ గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెపుతూ ఒకరోజు లోని 24 గంటల్లో రేటింగ్స్ రావడానికి కొన్ని డ్రమాటిక్ సీన్స్, సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి చూపిస్తారే తప్ప 24 గంటలూ పరిస్థితి అలాగే ఉండదు అంటూ ‘బిగ్ బాస్’ అసలు సీక్రెట్ ను బయట పెట్టాడు. 
ఆ సీన్లు చూపించలేదు
ఈఇంటర్వ్యూలో గతంలో సంజన ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలను గురించి మాట్లాడుతూ సంజన బాబు గోగినేనికి అమ్మాయిల పిచ్చ ఉంది అని కామెంట్ చేసిన విషయం పై స్పందిస్తూ  51 సంవత్సరాల వయసు గల బాబు గోగినేని ‘బిగ్ బాస్’ షోలోని అందరికీ తండ్రితో సమానం అంటూ కామెంట్స్ చేసాడు.  విజ్ఞానంతో పాటు అనేక సామాజిక  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న బాబు గోగినేని పై తనకు చాలామంచి అభిప్రాయం ఉందనీ బహూశా సంజన చెప్పిన మాటలు తప్పుగా అర్ధం అయి ఉంటాయని ఈవిషయంలో సంజన కూడ చాలమంచి అమ్మాయి అంటూ ‘బిగ్ బాస్ 2’ షోలో పాల్గొనడం వల్ల తనకు ప్రయోజనం వచ్చిందో లేదో తెలియదు కానీ తనకు నష్టం కలగలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు ఈ సామాన్యుడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: