‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన రాజమౌళి ఈమధ్య  గొప్ప దర్శకుడిగానే కాకుండా మంచి వక్త గా కూడ మారిపోతున్నాడు. దీనితో అతడు ఈమధ్య పాల్గొనే సినిమా ఫంక్షన్స్ లో చెప్పే విషయాలు చాల ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఈనేపధ్యంలో మొన్న జరిగిన ‘విజేత’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో జక్కన్న తనదైన శైలిలో ప్రసంగించి అందరి ప్రశంసలు పొందాడు. 
 ఆయన బెస్ట్ జడ్జ్
ఈవేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన చిరంజీవిని ఉద్దేశించి రాజమౌళి మాట్లుడుతూ చిరంజీవి  రహస్య స్కిల్స్ బయటపెట్టాడు. చిరంజీవి చాలమంచి యాక్టర్ డ్యాన్సర్ మంచి ఫైటర్ అని చాలమంది అనుకుంటారనీ అయితే చిరంజీవికి ఒకసినిమా కథను జడ్జ్ చేయడంలో ఉన్న స్పెషల్ స్కిల్ చాల తక్కువమందికి తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు. తాను ‘మగధీర’ సినిమాను తీసే మందు ఆకథను ముందుగా అప్పట్లో చిరంజీవికి చెప్పిన విషయాన్ని వివరిస్తూ చిరంజీవికి ఆకథ నచ్చిన తరువాత మాత్రమే తాను ‘మగధీర’ సినిమాను తీసిన సీక్రెట్ ను బయటపెట్టాడు రాజమౌళి.  
 అందరిలోనూ కాన్ఫిడెన్స్ వచ్చింది
ఇదేసందర్భంలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి మాట్లాడుతూ ‘విజేత’ సినిమాకు నిర్మాతలు ఇంత భారీస్థాయిలో ఖర్చు పెట్టడం చూస్తుంటే ఈమూవీ కథ చిరంజీవికి బాగా నచ్చింది అని అనిపిస్తోందని అంటూ ఈమూవీ వెనుక మెగా కాంపౌండ్ పరోక్ష సహాయం ఉంది అన్న ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇద ఇలా ఉంటే ‘విజేత’ ట్రైలర్ ను చూసిన విశ్లేషకులు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 
 సాయి కొర్రపాటి కాంప్రమైజ్ కాలేదు
ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాలా ఈమూవీ ఉండబోతోంది అన్న సంకేతాలు ఈట్రైలర్ ద్వారా అందుతున్నాయనీ తండ్రీకొడుకుల మ‌ధ్య అనుబంధానికి సెంటిమెంట్ బాగా ద‌ట్టించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పించడానికి చేసిన ప్రయోగం ‘విజేత’ అని అంటున్నారు. సామాన్యంగా ఒక యంగ్ హీరో ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ల‌వ్ స్టోరీ లేదంటే మాస్ యాక్ష‌న్ డ్రామాతో ఉండే కథలో నటిస్తాడని కానీ క‌ల్యాణ్ దేవ్ ఎంట్రీ మాత్రం అందుకు భిన్నంగా ‘విజేత’ లో ఉండబోతూ ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడిగా క‌నిపించ‌బోతున్న నేపధ్యంలో మాస్‌ యాక్ష‌న్ అంశాలు లేకుండా ఈసినిమా కనిపిస్తే ఎంతవరకు మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ను అంగీకరిస్తారు అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: