నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ఒకమాదిరిగా నడుస్తుంది. ఆడియెన్స్ కొందరు బిగ్ బాస్-2ని మొదటి సీజన్ తో కంపేర్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, నాని ఇద్దరు సెపరేట్ ఇమేజ్ కలిగిన స్టార్స్ కాబట్టి ఏ విషయంలో ఇద్దరిని కంపేర్ చేయలేం. ఇక 16 మంది కంటెస్టంట్స్ తో వచ్చిన బిగ్ బాస్ లో ముగ్గురు కామన్ మెన్ కు అవకాశం ఇచ్చారు.


మొదటి వారం సంజనా ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ లో ఉన్నంతసేపే కాదు బయటకు వచ్చాక సంజనా హాట్ కామెంట్స్ తో అదరగొట్టింది. ఇక ఈ వారం నూతన్ నాయుడు సెకండ్ ఎలిమినేటర్ గా బయటకు వచ్చాడు. చూస్తుంటే సెలబ్రిటీస్ అంతా కలిసి కామన్ మెన్ ను కార్నర్ చేస్తున్నారని టాక్ వస్తుంది.


ఇక సోమవారం ఎపిసోడ్ లో తదుపరి నామినేషన్ కోసం ఇంటి సభ్యులలో మేజర్ గా అందరు గణేష్ ను నామినేట్ చేశారు. అంటే మూడవ వారం కూడా కామన్ మెన్ ను ఎలిమినేట్ చేస్తారా అంటూ ఆడియెన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అసలు బిగ్ బాస్ లో కామన్ మెన్ కు ఎందుకు అవకాశం ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఒకవేళ వచ్చే వారం గణేష్ ఎలిమినేషన్ జరిగితే కచ్చితంగా బిగ్ బాస్ కామన్ మెన్ కు అన్యాయం చేసినట్టు అవుతుంది. గణేష్ తో పాటుగా కిరీటి, భాను శ్రీ, గీతా మాధురి, తేజశ్వి, కౌశల్ నామినేషన్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు వచ్చే వారం ఇంటి నుండి బయటకు వస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: